![]() |
![]() |
.webp)
కాశీ వెళ్తే ఇష్టమైనవి వదిలేయాలని చాలా మంది అంటారు. అదే కాయో, ఫలమో అని..మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ మాటలకు అర్థాన్ని పూర్తిగా మార్చేశారు జనాలు. కాశీ వెళ్తే ఇష్టమైన కాయగూరలు వదిలేశాం...అంటే వంకాయ వదిలేశాం, బెండకాయ వదిలేశాం అని చెప్తారు. ఐతే కాశీకి వెళ్తే వదిలేయాల్సిన వాటి గురించి చాలా చక్కగా చెప్పింది నచ్చావులే మూవీ నటి మాధవి లతా...అందరూ చెప్పినట్టు తాను కూడా వంకాయ వదిలేయాల్సి వస్తుందేమో అని భయపడిందట..కానీ అక్కడికి వెళ్ళాక ఆ మాటలకూ అసలు అర్ధం తెలిసిందట..ఆ విషయాన్ని వివరిస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. కాశీకి వెళ్తే కాయో..ఫలమో వదిలేసి రావాలి అంటే "కాయ మీద మొహం అంటే ఈ శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని..ఫలాన్ని ఆశించే తత్వం అంటే ఏదో వస్తుంది అంటే ఇంకేదో రావాలి అనే ఆశించే గుణాన్ని వదిలేసి రావాలి" అనేది అసలైన అర్ధం అని చెప్పింది. ఆ రెండూ తానెప్పుడూ ఆలోచించలేదని చెప్పింది మాధవి లతా. కానీ ప్రజలకు, భక్తులకు ఈ విషయం అర్ధం కాక కాయ, ఫలం అంటే ఇష్టమైన కూరగాయలు, ఫ్రూప్ట్స్ వదిలేయాలి అనుకుంటున్నారు. అందుకే ఆ పండు వదిలేశాం, ఈ కూరగాయ వదిలేశాం అని చెప్తారు.
పళ్ళు, కూరలు వదిలేస్తే శివుడికి వచ్చే లాభం ఏమిటి..ఏమీ లేదు...అందుకే కొంతమందిని ఆ కూరగాయను కాశీలో వదిలేసా తినను అంటారు ఆ నిర్వచనం కరెక్ట్ కాదు అంటూ ఇలా అసలైన అర్దాన్ని చెప్పి వారి అపోహలను తొలగించింది మాధవి.
![]() |
![]() |